
రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకరావాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ లో జరిగిన న్యాయవాదుల రక్షణ చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు సీఎం కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.
బహుజన సుమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయవాదులకు,డాక్టర్లు, ఇతర రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక సమగ్ర రక్షణ చట్టాన్ని తెస్తామని హామీ ఇచ్చారు. 41(A) CRPC చట్టాన్ని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారని.. తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై రాజకీయ నాయకుల ఒత్తిడి తగ్గే విదంగా చట్టాలు తీసుకరావాలన్నారు. పేద వర్గాల నుంచి వచ్చిన యువలాయర్ల కొరకు ఆఫీస్ సెటప్ కు బహుజన రాజ్యంలో రూ.5 లక్షల నుంచి 10 లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు.