కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన కోట్లు.. మరి పేదలకు?

కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన కోట్లు.. మరి పేదలకు?

హైదరాబాద్: కేసీఆర్ సర్కారుపై రాష్ట్ర బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోమారు విమర్శలకు దిగారు. బడా కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన కోట్లిస్తున్నారని.. మరి పేద ప్రజలేం కావాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమ దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందన్నారు. వాళ్లేమైనా ఫలక్ నుమా ప్యాలెస్ లో మెగా దావత్ కావాలని అడగడం లేదన్నారు. నెలకు వెయ్యి జీతం సరిపోదని.. కనీస వేతనం ఇవ్వాలనేదే వారి డిమాండ్ అన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కామధేనువులైన మెగా కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన కోట్లు ఇస్తోందని ఆరోపించారు. 

మరిన్ని వార్తల కోసం: 

అన్నదాతల ఆత్మహత్యలపై చర్చించాలి

కింగ్ కోబ్రాతో పోరాటం మాములుగా లేదు

టీమిండియా గురించి ఆందోళన అక్కర్లే