ఒకే రోజు మూడు పరీక్షలా?. తేదీలను మార్చండి: RS ప్రవీణ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వంపై  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. టీఎస్ పీఎస్ సీ పరీక్షల నిర్వహణను తప్పుబట్టారు. ఒకే రోజు మూడు పరీక్షలు నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అభ్యర్థి ఒకే రోజు మూడు నాలుగు పరీక్షలు ఎట్ల రాస్తాడని ప్రశ్నించారు. 

ఏప్రిల్ 30న విద్యుత్ సంస్థలో లైన్ మెన్ పరీక్ష ఉంది. ఇది కాకుండా మరో రెండు పరీక్షలు అదే రోజున జరుగుతున్నాయి. మూడు పరీక్షలు రాయాలనుకున్న అభ్యర్థి ఒకేసారి ఎలా రాస్తారని ప్రశ్నించారు.అభ్యర్థులు నష్టపోతారని..  పరీక్షల తేదీలను మార్చాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఒకే రోజు ఒకే పరీక్ష పెట్టాలని కోరారు. మిగతా పరీక్షలను వేరే తేదీల్లో నిర్వహించాలని కోరారు. 

పరీక్షల తేదీలను మార్చకుండా ప్రభుత్వం మొండిగా వెళ్తే బీఆర్ఎస్ పార్టీ నేతలను తెలంగాణ ఊర్లలో తిరగనియ్యబోమని ప్రవీణ్ కుమార్ వార్నింగ్ హెచ్చరించారు. పార్టీని బరాబర్ బొందపెడ్తామని అన్నారు.