హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ కలాసిగూడ ప్రాంతంలో శనివారం చిన్నారి మౌనిక మురికి కాలువలో పడి మరణించడం బాధాకరమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే మౌనికను పొట్టనబెట్టుకున్నదని ఆరోపించారు.
పేదలు నివాసం ఉండే ప్రాంతాలంటే ఎందుకంత నిర్లక్ష్యం అని శనివారం ఆయన ట్విట్టర్‌లో నిలదీశారు. మంత్రి కేటీఆర్ ఇంటి దగ్గర, కేసీఆర్ ఫాంహౌస్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ ఇలాగే ఉంటుందా అని ప్రశ్నించారు. ఆ చిన్నారి మరణానికి కారణమైన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డమాండ్ చేశారు.