![బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్](https://static.v6velugu.com/uploads/2024/03/rs-praveen-kumar-joined-brs-in-the-presence-of-kcr_eFLvYP39Mo.jpg)
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ కు గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు నేతలు. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి నేరుగా గజ్వేల్లోని కేసీఆర్ నివాసానికి భారీ ర్యాలీగా చేరుకున్నారు ఆర్ఎస్పీ శ్రేణులు. గజ్వేల్ లోని ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు.
తెలంగాణ భవన్‌కు వెళ్లేముందు ప్రొపెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తన రాజకీయ భవితవ్యంపై వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాఘలతో మేధోమధనం జరిపిన తర్వాత.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ALSO READ :- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే నడుస్తానని మాట ఇచ్చిన అందరికీ ధన్యవాదాలని తెలిపారు. తెలంగాణ విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం ఇవాళ (2024 మార్చి 18) కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరానన్నారు. ప్రజల కలలను నిజం చేసే దిశగా పయనిస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.