రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పోలీస్ రిక్రూట్ మెంట్ లో అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పోలీస్ రిక్రూట్ మెంట్ లో లాంగ్ జంప్ లో దేశంలో ఎక్కడా లేనట్లుగా 4 మీటర్లు పెట్టారని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. దీంతో చాలామంది అభ్యర్థులు మానసిక క్షోభకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పునపరిశీలించి.. అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.