తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధించడమే తన ధ్యేయమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దొరల రాజ్యం పోయి బహుజనుల రాజ్యం ఏర్పడే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. కరీంనగర్ మానకొండూర్ మండలంలోని బీఎస్పీ బహుజన రాజ్యాధికార పాదయాత్రలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. కొండపల్కల గ్రామంలో బీఎస్పీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. స్థానికులు కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు.
బహుజన రాజ్యాధికారం రావాలంటే గ్రామ ప్రజలు అందరూ కలిసి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.