బీఎస్పీ, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ.. కాగజ్ నగర్ లో ఉద్రిక్తత

బీఎస్పీ, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ.. కాగజ్ నగర్ లో ఉద్రిక్తత

కొమురంభీం జిల్లా  కాగజ్ నగర్ లో ఉద్రిక్తత వాతారణం చోటుచేసుకుంది. కాగజ్ నగర్ లోని సర్ సిల్క్ కాలనీలో నిర్వహించిన సభలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతుండగా..  బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కోడిగుడ్లు విసిరెందుకు ఎమ్మెల్యే కొనప్ప అనుచరుల యత్నం చేశారు. దీంతో బీఎస్పీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.

 అప్రమత్తమైన పోలీసులు అడ్డుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల దాడికి నిరసనగా కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లారు. తమపై దాడికి ప్రయత్నించిన బీఆర్ఎస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.