కేసీఆర్​ను చర్లపల్లి జైలుకు పంపుతాం: ​ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​

  •    రూ.1.25 లక్షల కోట్లు అవినీతి చేసిండు 
  •     కాంట్రాక్టులన్నీ దొరలకే ఇచ్చిండు 
  •     మళ్లీ ఈ దొంగల ముఠా ఓట్ల కోసం వస్తున్నరు జాగ్రత్త
  •     బీఎస్పీ  స్టేట్ ​చీఫ్​ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​

పెద్దపల్లి, వెలుగు:  బీఎస్పీ సర్కార్​ వస్తే సీఎం కేసీఆర్​ను ఎరవెల్లి ఫాంహౌజ్ ​నుంచి చర్లపల్లి జైలుకు పంపిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రవీణ్​కుమార్​ మాట్లాడారు. రూ. 1.25 లక్షల కోట్ల అవినీతి చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు, కవితల దొంగల ముఠా మళ్లీ ఓట్ల కోసం వస్తోందన్నారు. 

తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, మరోసారి మోసపోవద్దన్నారు. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు సర్​ప్లస్ ​స్టేట్​గా ఉండేదని, కేసీఆర్​అప్పుల పాలు చేసిండనన్నారు. కేసీఆర్​ పాలనకు మేడిగడ్డ బ్యారేజీ దుస్థితే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడాలన్నారు. నూటికి తొంబై మంది ఉన్న బహుజనులు రాజ్యాధికారం సాధిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. సర్కార్​ ఇచ్చే తాయిలాలు ప్రజలు కోరుకోవడం లేదని, ప్రజలు న్యాయం కోరుకుంటున్నారన్నారు. బాంచన్​ కాళ్లు మొక్కుతా అనే పరిస్థితి నుంచి బయటకు రావాలన్నారు. 

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పనిలో కాంట్రాక్టర్లంతా కేసీఆర్​కు కుటుంబానికి సంబంధించిన దొరలే అని అన్నారు. బీఎస్పీ అభ్యర్థులను గెలిపిస్తే నిత్యం ప్రజ ల్లో ఉంటారని, కేసీఆర్​ కుటుంబం లాగా గడీలలో ఉండరన్నారు. తర్వాత నిర్వహించిన ర్యాలీలో ప్రవీణ్​కుమార్ తో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష, నాయకులు ఈర్ల కొమురయ్య పాల్గొన్నారు.