మత విద్వేషాలతో నీచ రాజకీయాలు; ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మత విద్వేషాలతో నీచ రాజకీయాలు;  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • రాజ్యాంగ స్వేచ్ఛను హరిస్తున్న పాలకులు

    
కాగజ్ నగర్, వెలుగు : తమ స్వార్థం, లబ్ధి కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను విడగొట్టేలా కొన్ని శక్తులు నీచమైన రాజకీయాలు చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సిర్పూర్ టి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన ఆదివారం కాగజ్ నగర్ పట్టణంలోని పలు చర్చిలను సందర్శించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనే నీచమైన ఆలోచనలో కొన్ని పార్టీలున్నాయన్నారు. 

ALSO READ :ఒకే పనిని రెండు స్కీమ్స్ కింద చూపించి..కోట్లు దోచుకుంటున్నరు

ప్రార్థనా మందిరాలను కూడా కూల్చేస్తున్నారని, రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కులను ప్రభుత్వాలు గౌరవించడం లేదన్నారు. దేశంలో మత స్వేచ్ఛ ప్రమాదంలో ఉందన్నారు. రాజ్యాంగాన్ని, అన్ని మతాల ఆచారాలను, హక్కులను కాపాడే ఏకైక పార్టీ బీఎస్పీ అని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అర్షద్ హుస్సేన్, సిడం గణపతి, జిల్లా నాయకులు చిన్నయ్య, నవీన్, నియోజకవర్గ నాయకులు రాంప్రసాద్, నక్క మనోహర్, శ్రీనివాస్, శోభన్ పాల్గొన్నారు.