కేసీఆర్ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్ ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్నారు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ నేతలను ఫుట్ బాల్ ఆడుకోవాలన్నారు. దివ్యాంగులకు ప్రతినెల రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో బీఎస్పీ ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. 

దివ్యాంగుల సమస్యలపై దృష్టి పెట్టని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. BRS నేతల మాదిరి కమీషన్లు తీసుకొని అడ్డగోలుగా సంపాదించడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము పని చేయకపోతే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పారు.