డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాలు రాక యువత హమాలీ పనికి పోతున్నారని బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్లో దాదాపు 1500 మంది గ్రాడ్యుయేట్లు హమాలీలుగా పనిచేస్తున్నారు. వీరంతా పత్తి, మిర్చి లోడింగ్ చేసి ఒక్కో బస్తాకు రూ. 3 తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వార్త వెలుగు పేపర్ లో ప్రచురితం అయింది. ఇది చూసిన ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ స్పందించి.. కేసీఆర్ ప్రభుత్వంలో ఇంతకన్నా మనకు ఏం ఒరగదని ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితులు మారాలంటే ఏనుగు గుర్తుకు ఓటేసి బహుజన రాజ్యం స్థాపించుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.
‘కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు ఇంతకన్నా ఏం ఒరగదు గాక ఒరగదు. అందుకే ఇకనైనా ఏనుగు గుర్తుకు ఓటేసుకొని మన రాజ్యం తెచ్చుకుందాం. మన బంగారు భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. ఈ రోజే మన గ్రామంలో, బస్తీలో నీలి జెండాను ఎగరేద్దాం... అందరం కలిసి బహుజన రాజ్య ప్రతిజ్ఞ చేద్దాం’ అని ఆర్ఎస్. ప్రవీణ్ ట్వీట్ చేశారు.
KCR-TRS ప్రభుత్వంలో మనకు ఇంతకన్నా ఏం ఒరగదు గాక ఒరగదు. అందుకే ఇకనైనా ఏనుగు గుర్తుకు ఓటేసుకొని మన రాజ్యం తెచ్చుకుందాం. మన బంగారు భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. ఈ రోజే మన గ్రామంలో బస్తీలో నీలి జెండాను ఎగరేద్దం. అందరం కలిసి బహుజనరాజ్య ప్రతిజ్ఞ చేద్దం. pic.twitter.com/TQTESc4AF1
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) January 25, 2022
For More News..