మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల స్థానికులను శరణార్థులుగా మార్చారని బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కొందరికి మేలు చేయడానికే ఈ ప్రాజెక్ట్ నిర్మించారని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 14 గ్రామాల ప్రజల జీవితాలు నాశనమయ్యాయని ప్రవీణ్ అన్నారు. ప్రాజెక్ట్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను శరణార్థులుగా మార్చిన తర్వాత ఇంకా ఏ జాతి మిగిలిందని అంకితం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇంతమంది జీవితాలతో ఆడుకున్న మిమ్మల్ని మల్లన్న వదలడని ఆయన హెచ్చరించారు.
నిజాల్ని తారుమారు చేసి ప్రజల కష్టార్జితంతో కొందరికే మేలు చేయడానికి కట్టిన ఈ ప్రాజెక్టు 14 గ్రామాల ప్రజల జీవితాల్లో చేసిన విలయతాండవాన్ని మాటల్లో చెప్పలేము. పుట్టిన గడ్డ మీదే ప్రజలను శరణార్థులుగా మార్చినాక ఇంక ఏ జాతి మిగిలిందని అంకితం చేయడానికి? మల్లన్న మిమ్ముల వదలడు. #KCRGoBack pic.twitter.com/pMkEp3lXtA
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) February 23, 2022
For More News..