రాజ్యాంగం మార్చొద్దన్నందుకు సీఎం కేసీఆర్ తన అనుచరులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాజ్యాంగం మార్చి ఆయన రాయాలనుకుంటున్న కొత్త రాజ్యాంగంలో కనీసం మాట్లాడే హక్కులు అయినా ఉంటాయా అని ప్రవీణ్ విమర్శించారు. రాజ్యాంగం మార్చొద్దన్నందుకు మాపై కేసులు పెడితే.. మీరు మాట్లాడే భాషపై మేమెన్ని కేసులు పెట్టాలి అని అడిగారు. మా ఆత్మగౌరవం కోసం దేనికైనా సిద్ధమైనోళ్లం.. మీ కేసులకు భయపడతామా అని ప్రశ్నించారు.
KCR గారు, తమరు రాయబోతున్న రాజ్యాంగంలో మాకు మాట్లాడే హక్కులు కూడా ఉండవన్న మాట! అందుకే మీ అనుచరులతో ప్రజలపై రోజూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. మీరు ప్రజలపై వాడిన అహంకారపు భాష పై మేమెన్ని కేసులు పెట్టాలి? మా ఆత్మగౌరవం కోసం దేనికైనా సిద్దమైనోళ్లం, నీ కేసులకు భయపడ్తమా?? https://t.co/cPjRmbMfnG
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) February 15, 2022
For More News..