ప్రగతి భవన్లో పార్టీ కార్యకలాపాలా..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రజల అభివృద్ధి కోసం పని చేయాల్సిన ప్రగతి భవన్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పార్టీ కార్యకలాపాలు తెలంగాణ భవన్ లేదా ఫాంహౌస్లో నిర్వహించుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఆయన బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే అనుచరులకు, కమీషన్లు ఇచ్చిన వారికే దళితబంధు ఇస్తున్నారని ఆరోపించారు. దాదాపు రెండు లక్షల మంది ఎస్సీ కార్పోరేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కంటి వెలుగు పథకం ఎన్నికల్లో ఓట్ల కోసమే ప్రారంభించారని విమర్శించారు.