కేసీఆర్ ఇక సర్దుకోండి.. జైలుకు పంపడం ఖాయం : ఆర్ఎస్ ప్రవీణ్ 

TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.పేపర్ లీకేజీ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన సిట్ ఏ మాత్రం విచారణ చేయకుండా.. అసలు నిందితులను కంటికి రెప్పలా కాపాడుతోందని ట్వీట్ లో ఆరోపించారు. 

దర్యాప్తు సరిగా జరగకపోవడం వల్లే తాము కొత్త సాక్ష్యాలతో బీఎస్పీ తరపున శుక్రవారం (ఏప్రిల్ 28వ తేదీన) తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ అందిస్తామని ప్రకటించారు.

‘‘తెలంగాణ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేసి, పేపర్ల లీకులపై మాట్లాడకుండా ఇతర రాష్ట్రాల్లో తప్పించుకు తిరుగుతున్న కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు జైలుకు పంపడం ఖాయం. ఇక సరద్దుకోండి’’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

https://twitter.com/RSPraveenSwaero/status/1651551444720549888