
రాష్ట్రంలోని కమీషన్ల, దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కొమరంభీం అసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కాగజ్ నగర్ లో పర్యటించారు. కాగజ్ నగర్ మండలంలోని అందేవెల్లి దగ్గర పెద్దవాగు బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను,పాలనను తప్పుబట్టారు. సీఎం కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, కట్టుకునే ఫామ్ హౌస్ లకు 80 ఫీట్ల వెడల్పుతో అద్దాల్లాంటి రోడ్లు వేసుకుంటున్నారు కానీ కాగజ్ నగర్,దహెగాం మండలాల మధ్య 70 గ్రామాల ప్రజలకు కనెక్టివిటీ చేసే పెద్దవాగు బ్రిడ్జి కూలిపోయి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు కంప్లీట్ చేయలేదని ప్రశ్నించారు.
స్థానిక ఎమ్మెల్యే అనుచరులు బాలభారతి స్కూల్ కు కరెంట్, నీళ్లు కట్ చేశారని ఆరోపించారు. టీచర్లను కూడా వేధించడం దారుణమని ఫైరయ్యారు. వేధింపులకు గురిచేసిన వారిపై కేసులు పెడితే..పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.