
హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటతీరు సరిగా లేదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రీసెంట్ గా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను విమర్శిస్తూ ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడిన తీరు, ఆయన వాడిన పదజాలం బాగోలేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. అహంకారపూరిత భాషను రోజూ వాడే వ్యక్తి కొత్త రాజ్యాంగం రాస్తే అది ఎట్లుంటదో, అది ఎవరి ప్రయోజనాలను కాపాడుతుందో ఊహించుకోండన్నారు. మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, సీఎం కార్యాలయంలోనూ మహిళా ఆఫీసర్లు, విలేకర్లలోనూ మహిళలు ఉన్నారని.. కేసీఆర్ మాటతీరుకు వాళ్లు ఎంత కుమిలిపోయి ఉంటారోనన్నారు. ఇంటా, బయటా ఎక్కడైనా ఇలాంటి భాష వాడకూడదని.. బహుజన రాజ్యంలో సాటి మనిషిన కించపరిచే ఏ పదాన్నైనా నిషేధిస్తామని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ప్రెస్ మీట్ లో కేసీఆర్ వాడినటువంటి పలు పదాలతో కూడిన ఓ ఫొటోను ఈ ట్వీట్ కు ఆయన జత చేశారు.
మొన్న ప్రభుత్వ కార్యాలయమైన ప్రగతి భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి గారి నోటి నుండి జాలువారిన పదరత్నాలు ఇవి. ఇంతటి అహంకారపూరిత భాషను రోజూ వాడే వ్యక్తి కొత్త రాజ్యాంగం రాస్తే అది ఎట్లుంటదో అది ఎవరి ప్రయోజనాలను కాపాడుతదో ఊహించండి.#ResignKCR #MisogynistKCR pic.twitter.com/AsD6t3FSig
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) February 3, 2022
మరిన్ని వార్తల కోసం: