కాంగ్రెస్ సీనియర్ నేత, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరూ నాయకులు సుమారు గంట పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. అయితే.. సంపత్ కుమార్ ను ఆర్ఎస్ ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారని రెండు పార్టీల నాయకులు చెబుతున్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ తో సంపత్ కుమార్ భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సంపత్ కుమార్ కాంగ్రెస్ వీడి.. బీఎస్పీలోకి వెళ్తారా..? లేక కాంగ్రెస్ లో ఉంటారా..? అనే చర్చలు సాగుతున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఎలా చర్చలు జరిగాయనేదానిపైనా మాట్లాడుకుంటున్నారు.