- ఏటా 500 మందికి అందజేస్తామని గౌతమ్ అదానీ కొడుకు ప్రకటన
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ కొడుకు జీత్ అదానీ, కాబోయే కోడలు దివా జైమిన్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏటా 500 మంది దివ్యాంగ యువతుల పెళ్లికి రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తామని చెప్పింది. ఈ మేరకు వారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. ‘
‘జీత్, దివా పవిత్ర సంకల్పంతో వారి వివాహ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఏటా 500 మంది దివ్యాంగ యువతుల పెళ్లికి రూ.10 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వారు తీసుకున్న ఈ మంగళ సేవ ప్రతిజ్ఞ ఒక తండ్రిగా నాకు సంతృప్తిని ఇచ్చింది” అని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.