ఆర్చర్ చికితకు రూ. 10 లక్షల స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌

ఆర్చర్ చికితకు రూ. 10 లక్షల స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆర్చరీ వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌, ఆసియాకప్‌‌‌‌‌‌‌‌కు ఎంపికైన పెద్దపల్లి జిల్లాకు చెందిన యంగ్  ఆర్చర్‌‌‌‌‌‌‌‌ టి.చికితరావుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ (హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ) ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌, అక్షర విద్యాసంస్థల చైర్మన్‌‌‌‌‌‌‌‌ అర్శనపల్లి జగన్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌ రావు ఆర్థిక భరోసా కల్పించారు.  రైతు కుటుంబానికి చెందిన చికిత  ప్రోత్సాహం లేక ఇబ్బంది పడుతుందని తన దృష్టికి రావడంతో   రూ. ప‌‌‌‌‌‌‌‌ది లక్షల స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నట్టు జగన్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి విడతగా మంగళవారం  రూ.50 వేల చెక్‌‌‌‌‌‌‌‌ను అందించారు. ఫిబ్రవరి నుంచి తన శిక్షణ నిమిత్తం ప్రతి నెల రూ.15 వేలు ఉపకార వేతనం ఐదేళ్ల పాటు అక్షర విద్యా సంస్థల నుంచి  ఇస్తామని హామీ ఇచ్చారు.