ఆలేరు చెక్​పోస్ట్​ వద్ద రూ.1.26 కోట్లు స్వాధీనం

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా ఆలేరు చెక్​పోస్ట్​ వద్ద భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ నుంచి హైదరాబాద్​కు ఓ జాతీయ బ్యాంకుకు చెందిన నగదు తీసుకెళ్తున్న వెహికల్​ను ఆలేరు చెక్​పోస్ట్​ వద్ద ఆపి సోదా చేశారు.

వెహికల్​లో రూ.1,26,50,000 ఉండగా, అవి బ్యాంకుకు సంబంధించిన నగదు అని స్టాఫ్ చెప్పారు. పేపర్స్​ చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని రూరల్​ సీఐ సురేందర్​రెడ్డి, ఎస్ఐ శ్రీను తెలిపారు.