చెట్లను కొట్టేసిన బిల్డర్లకు రూ.16 వేలు ఫైన్

  • ‘వెలుగు’ కథనానికి స్పందించిన అధికారులు 

అల్వాల్, వెలుగు:  కమర్షియల్ బిల్డింగ్ పనులకు అడ్డుగా ఉన్నాయని హరితహారం చెట్లను కొందరు బిల్డర్లు అడ్డంగా నరికేశారు. దీనిపై వెలుగు న్యూస్ పేపర్ లో గురువారం ‘అడ్డోస్తున్నాయని అడ్డంగా నరికేశారు’.. కథనానికి అధికారులు స్పందించారు. సుమారు 20 చెట్లను కొట్టివేయగా.. మున్సిపల్, అటవీ అధికారులు  బిల్డర్లుకు రూ. 15,990  ఫైన్ విధించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.