న్యూఢిల్లీ : డీఎక్స్‌సీ టెక్నాలజీస్ కంపెనీ (గతంలో సీఎస్‌సీ) ట్రేడ్ సీక్రెట్స్‌ను టీసీఎస్ దుర్వినియోగం చేసినందుకు 194 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,610 కోట్లు) పెనాల్టీ చెల్లించాలని డాలస్ (యూఎస్) కోర్టు ఆదేశించింది. 56 మిలియన్ డాలర్లను డ్యామేజ్‌లకు కాంపెన్సేషన్‌గా, 112 మిలియన్ డాలర్లను ఎక్సంప్లరీ డ్యామేజిల కింద డీఎక్స్‌సీకి చెల్లించాలని పేర్కొంది. 25 మిలియన్ డాలర్లను వడ్డీ కింద చెల్లించాలని తీర్పిచ్చింది.
కోర్టు ఆదేశాల ప్రకారం, ట్రేడ్ సీక్రెట్స్ యాక్ట్, 2016 కింద ట్రేడ్ సీక్రెట్స్‌ను టీసీఎస్ దుర్వినియోగం చేసింది. తీర్పుపై అప్పీల్ చేస్తామని టీసీఎస్ పేర్కొంది. ఐపీని దొంగలించిందనే ఆరోపణలపై 2022 లో ఓ కేసులో 140 మిలియన్ డాలర్లను ఎపిక్ సిస్టమ్స్‌కు పెనాల్టీ కింద చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశించింది.