కారు డిక్కీలో నుంచి రూ.2 లక్షలు చోరీ

కారు డిక్కీలో నుంచి రూ.2 లక్షలు చోరీ

బాన్సువాడ రూరల్, వెలుగు : బాన్సువాడ పట్టణంలో సినీ ఫక్కీలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 11వ తేదీన  ఇబ్రహీంపేట్  తండాకు చెందిన కాంట్రోత్ చందర్ బాన్సువాడ ఎస్​బీఐ నుంచి రూ. 2 లక్షలు డ్రా  చేసుకుని కారు డిక్కీలో పెట్టి, కొబ్బరి కాయలు కొనేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి కారు డిక్కీ ఓపెన్​ చేసి ఉండగా, అందులో డబ్బులు లేవు. 

అక్కడున్న సీసీ ఫుటేజ్​ను పరిశీలించగా ముగ్గురు దుండగులు చోరీ చేసినట్లు తెలిసింది. ఒకరు చందర్ ను ఫాలో చేయగా, మరొకరు కారులో ఉన్న డబ్బులు తీసుకుని బైక్ పై పరారయ్యాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్​ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.