కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.20,200 ధర పలికింది. ఈ ఏడాది మిర్చి సీజన్ ప్రారంభంలో ఇదే గరిష్ట ధర అని మార్కెట్ కమిటీ సెక్రటరీ సంగయ్య తెలిపారు.
ప్రస్తుతం మిర్చి సీజన్ ప్రారంభమైందని, ఏనుమాముల మార్కెట్‌కు వివిధ రకాల మిర్చి వస్తోందని ఆయన చెప్పారు. మిర్చీకి మరింత ధర వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.