రూ.23 వేల కోట్ల.. పన్ను ఎగ్గొట్టిన శ్రీసిమెంట్స్! ఏటా రూ.1,400 కోట్లు..

న్యూఢిల్లీ: శ్రీసిమెంట్స్​ రూ.23 వేల కోట్ల విలువైన పన్నులను ఎగ్గొట్టిందని, ఇందుకోసం పలు అక్రమాలకు పాల్పడిందని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. సంస్థకు చెందిన పలు ఆఫీసులపై దాడులు చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నాయి. ఈ కంపెనీ ఏటా రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు విలువైన పన్నును ఎగ్గొట్టినట్టు గుర్తించారు. ఈ గ్రూప్​ ట్యాక్స్ ​డిడక్షన్​ క్లెయిములపై అనుమానం రావడంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు కుంభకోణం జరిగినట్టు తేల్చారు. మనదేశ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన భారీ పన్ను కుంభకోణాల్లో ఇదీ ఒకటని ఐటీ శాఖ సీనియర్​ అధికారి ఒకరు చెప్పారు. కంపెనీతో సంబంధిత గ్రామ సర్పంచ్​, గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఎత్తున నష్టం జరిగింది. ఫోర్జరీకి సంబంధించి అధికారులు పలు డాక్యుమెంట్లను సీజ్​ చేశారు.

అయితే ఐటీ అధికారుల విచారణ గురించి తమకు ఏమీ తెలియదని శ్రీసిమెంట్​ గ్రూపు మెంబర్లు కొందరు అన్నారు. దాడుల తర్వాత శ్రీ గ్రూప్ చైర్మన్ హెచ్.ఎన్.బంగూర్, వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా గ్రూప్ జాయింట్ ప్రెసిడెంట్ అరవింద్ ఖిచాను పలుమార్లు విచారణకు పిలిచినప్పటికీ ఆయన కూడా ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు హాజరుకాలేదు. ఐటీ అధికారులు సైతం సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్​లను సంప్రదించలేకపోయారు. దీనిపై కంపెనీ అధికారులు వివరణ ఇచ్చారు. ఐటీ శాఖ తమ ఆఫీసుల్లో సర్వే నిర్వహిస్తోందని, వారికి పూర్తిగా సహకరిస్తున్నామని అన్నారు. తమ కంపెనీ మేనేజ్​మెంట్ ​టీమ్​ వారికి అందుబాటులో ఉందని చెప్పారు. ఐటీ శాఖ ఎలాంటి సమాచారం కోరినా ఇస్తామన్నారు. ఈ విషయాన్ని బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలకు   శ్రీసిమెంట్స్​ తెలియజేసింది. సంస్థ ఇన్వెస్టర్లకు కూడా దాడుల గురించి వివరణ ఇచ్చినట్టు తెలిసింది.

ALSO READ:లక్ష మంది ఆసాములకు 670 కోట్ల రైతుబంధు..లిస్టులో ప్రజాప్రతినిధులు, లీడర్లు, పెద్దాఫీసర్లు

24 చోట్ల దాడులు

జైపూర్​  ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి చెందిన బృందం జైపూర్, బీవార్, ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, అజ్మీర్, చిత్తోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని శ్రీ సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 24కిపైగా  ప్రదేశాలపై దాడులు చేసింది. ఈ సోదాల్లో 200 మందికి పైగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. సిమెంట్ ఉత్పత్తి కోసం కొనుగోలు చేసిన బొగ్గుకు సంబంధించిన ఖాతాల్లో, అందుకు సంబంధించిన చెల్లింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయని తేల్చారు. కొత్త టెక్నాలజీ, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ సాయంతో ఆ శాఖ ఈ మోసాన్ని ఐటీశాఖ గుర్తించింది. నిజమైన బకాయిలకు, శ్రీసిమెంట్​తీసుకున్న పన్ను మినహాయింపులకు మధ్య చాలా తేడాలు ఉన్నట్టు వెల్లడయింది.  శ్రీసిమెంట్​ మాదిరే మరికొన్ని కంపెనీలు కూడా తమ నిఘాలో ఉన్నాయని, వాటిపైనా త్వరలోనే దాడులు చేస్తామని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు రియల్​ ఎస్టేట్, మైనింగ్​ కంపెనీలు, బడా వ్యాపారులు పన్నులు ఎగ్గొట్టినట్టు గుర్తించామని అన్నారు. ఇదిలా ఉంటే శ్రీసిమెంట్స్​లో రూ.23 వేల కోట్ల కుంభకోణం బయటపడ్డట్టు వార్తలు రావడంతో స్టాక్​ మార్కెట్లో కంపెనీ షేర్లు కుప్పకూలాయి. సోమవారం ఇంట్రాడేలో 10 % పడగా, చివరికి 6 % నష్టపోయి రూ.23,740 వద్ద ముగిశాయి.