కెటిల్స్ వాడినందుకు రూ.30వేలు ఫైనా?

కెటిల్స్ వాడినందుకు రూ.30వేలు ఫైనా?
  • హెచ్​సీయూ హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించాలి 
  • క్యాంపస్​లో ఎస్ఎఫ్ఐ నాయకుల ఆందోళన
  • హాస్టల్​ చీఫ్​ వార్డెన్​ను తొలగించాలని డిమాండ్

గచ్చిబౌలి, వెలుగు : హైదరాబాద్​సెంట్రల్​యూనివర్సిటీ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు మంగళవారం ఆందోళనకు దిగారు. చీఫ్​వార్డెన్​సువాశిసా రాణాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిన్నచిన్న సాకులు చూపిస్తూ వేలల్లో ఫైన్లు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చీఫ్ వార్డెన్ తోపాటు ఫ్లయింగ్​స్క్వాడ్​ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. స్టూడెంట్ల అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు తీసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆరోగ్యం బాగోలేనప్పుడు వేడి నీళ్ల కోసం కెటిల్స్ వాడుతున్న స్టూడెంట్లకు రూ.10 వేల నుంచి రూ.30వేలు దాకా ఫైన్లు వేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు రూ.30వేలు చొప్పున ముగ్గురికి, రూ.20వేలు చొప్పున నలుగురికి, రూ.10వేలు చొప్పున ఆరుగురికి ఫైన్లు విధించారని వాపోయారు. హాస్టళ్లలోని సమస్యలు పరిష్కరించడంలో చీఫ్​వార్డెన్​ఫెయిల్​అయ్యారని, మెస్​లో పెడుతున్న ఫుడ్​అధ్వానంగా ఉంటోందని ఆరోపించారు. 

తన ఫెయిల్యూర్​ను కప్పిపుచ్చుకునేందుకు స్టూడెంట్లకు ఫైన్లు వేస్తున్నారన్నారు. యూనివర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి చీఫ్​వార్డెన్​సువాశిసా రాణాను వెంటనే తొలగించాలని, మెస్‌‌‌‌‌‌‌‌ కమిటీలు, హాస్టల్‌‌‌‌‌‌‌‌ కమిటీలు వేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రతి హాస్టల్​లో వేడినీళ్లు అందించాలని కోరారు.