సూర్యాపేట ఉషశ్విని మిల్లులో రూ.32 కోట్ల కస్టమ్ ​మిల్లింగ్​ రైస్​హాంఫట్​

  • జిల్లాలోని మరో రెండు చోట్లా ఇదే పరిస్థితి
  • మిర్యాలగూడలో రూ.4 కోట్ల బియ్యం కనిపిస్తలే..
  • బయటకు తెలియనివ్వని అధికారులు 
  • కేసులు నమోదు చేశామన్న ఆఫీసర్లు 

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లాలో ఓ మిల్లర్​ భారీ మొత్తంలో సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైస్) ను మాయం చేశాడు. కోదాడ మండలం కాపుగల్లులోని శ్రీ ఉషశ్విని పారాబాయిల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లులో తనిఖీలు చేపట్టగా అధికారులకు ఈ విషయం తెలిసింది. అదే విధంగా గడ్డిపల్లిలోని మరో మిల్లులో సుమారు రూ. 25 కోట్లు, ముకుందాపురంలోని మరో మిల్లులో రూ. 30 కోట్ల విలువ చేసే వడ్లు మాయమైనట్లు సమాచారం.  2020-–21 రబీ, 2021–-22 ఖరీఫ్, రబీ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన శ్రీ ఉషశ్వని పారాబాయిల్డ్​మిల్లుకు అధికారులు వడ్లను కేటాయించారు. గత మూడు సీజన్లలో వడ్లను అందజేసినా సకాలంలో అప్పగించకపోవడంతో ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటాయించలేదు. అయినా పాతవి ఇవ్వకపోవడంతో ఈ నెల 18న సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు మిల్లులో నిల్వలను పరిశీలించారు. దీంతో వడ్లు లేని విషయం వారి దృష్టికి వచ్చింది. కానీ విషయం బయటకు రానివ్వలేదు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వడ్లను  కేటాయిస్తే సీఎంఆర్​బకాయిలు పూర్తి చేస్తానని మిల్లు ఓనర్​కొద్ది రోజులుగా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చుట్టూ తిరిగినట్టు సమాచారం. కానీ, అధికారులు నిరాకరించడంతో గురువారం మిల్లు మూసి పరారైనట్లు తెలిసింది. ఈ మిల్లులో సుమారు. రూ. 32 కోట్ల విలువ చేసే వడ్లు మాయమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గురువారం మిల్లర్ పై అధికారులు  క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ మిల్లు కాపుగల్లుకు చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ భర్తది కావడంతో అధికారులు విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. కనీసం మిల్లుకు ఎన్ని వడ్లు కేటాయించారన్న సమాచారం కూడా ఇవ్వడం లేదు. వీరికి కోదాడకు చెందిన ముఖ్య నేత అండ ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై  డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ పుల్లయ్య మాట్లాడుతూ శ్రీ ఉషశ్వని మిల్లులో సీఎంఆర్​కు కేటాయించిన వడ్లు లేనట్లు గుర్తించామన్నారు. మిల్లు యాజమానిపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలు చేసి ప్రభుత్వ సొమ్ము రికవరీ చేస్తామన్నారు.  

మిర్యాలగూడలో వజ్ర రైస్ మిల్లుపై కేసు  

మిర్యాలగూడ :  మిర్యాలగూడ పరిధిలోని ఓ రైస్​మిల్లుకు ఇచ్చిన సుమారు రూ. 4  కోట్ల పైగా విలువైన సీఎంఆర్​ బియ్యం తిరిగి ఇవ్వకపోవడంతో మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జిల్లా సివిల్ సప్లయ్​ అధికారుల కథనం  ప్రకారం..2020–21 రబీ సీజన్ లో మిర్యాలగూడ మండల పరిధిలోని యాద్గార్ పల్లి వద్ద ఉన్న వజ్ర పారాబాయిల్డ్ రైస్ మిల్లు కు 4,339.960 టన్నుల ప్యాడీ ఇచ్చారు. దీనికి గాను ఈ మిల్లు నుంచి 2,982 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా సుమారు 759 మెట్రిక్ టన్నులు అప్పగించారు.  రూ. 4 కోట్ల కుపైగా విలువైన 2,233 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ను మాయం చేసినట్టు గుర్తించామన్నారు.  దీంతో ఓనర్లపై గతనెల మిర్యాలగూడ రూరల్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా, విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. సదరు మిల్లు ఓనర్ల నుంచి ప్రభుత్వ సొమ్ము రాబట్టుకునేందుకు పై ఆఫీసర్ల ఆదేశాల మేరకు ఆర్ ఆర్ యాక్ట్ అమలు చేస్తామని, ప్యాడీ వేలంతో పాటు వారి ఆస్తులను నిషేధిత జాబితాలో చేరుస్తామని అధికారులు చెప్పారు. అలాగే మిల్లర్స్ అసోసియేషన్ కు సంబంధించిన పలువురికి  నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.