FedEx కొరియర్ పేరుతో రూ.43 లక్షల టోకరా.. సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా రికవరీ చేశారంటే..

FedEx కొరియర్  పేరుతో రూ.43 లక్షల టోకరా.. సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా రికవరీ చేశారంటే..

సైబర్ నేరగాళ్లు అమాయకులను భలే తెలివిగా బోల్తా కొట్టిస్తుంటారు. ఇటీవల ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి నుంచి 43 లక్షల రూపాయలు కొట్టేశారు. FedEx కొరియర్  పేరుతో  సైబర్ మోసగాళ్ళు అకౌంట్ ను ఊడ్చేసిన ఘటన ఈ మధ్య సంచలనం సృష్టించింది.

ఈ కేసులో పోలీసులు సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బును రికవరీ చేశారు. బాధితుడు మోసపోయినట్లు తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. వివిధ ఖాతాల నుంచి  డబ్బులు సేకరించి బాధితునికి రీఫండ్ చేశారు. రూ. 43 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాక ఏ ఏ అకౌంట్లకు బదిలీ అయ్యాయో ట్రాక్ చేశారు. నిందితుల అకౌంట్లను ఫ్రీజ్ చేసి.. చివరికి బాధిత రిటైర్డ్ ఉద్యోగికి మొత్తం రూ.36 లక్షల యాభై వేలను రికవరీ చేసి ఇచ్చారు. 

తిరిగి వస్తుందో లేదో అనుకున్న తన కష్టార్జితాన్ని పోలీసులు రికవరీ చేయడంపై ఆనందం వ్యక్తం చేశాడు బాధితుడు. డబ్బును తన నుంచి చాలా తెలివిగా, నమ్మించి లాగేసుకున్నట్లు తెలిపాడు. ఫెడెక్స్ కొరియర్ వచ్చిందని,  రూ.43 లక్షలు డిపాజిట్ చేస్తే కొరియర్ ఇస్తామని చెప్పి  డబ్బులు గుంజేసినట్లు తెలిపాడు. తనకు చాలా రెట్లు లాభం వస్తుందని, వాళ్లు  అందించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయమని ఒప్పించారని, డబ్బులు పంపిన తర్వాత రెస్పాన్స్ లేదని, వెంటనే పోలీసులను ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు.