లోక్​పాల్​కు రూ.44.32 కోట్లు

లోక్​పాల్​కు రూ.44.32 కోట్లు

న్యూఢిల్లీ: స్వతంత్ర ప్రతిపత్తి గల లోక్​పాల్​కు తాజా బడ్జెట్​లో రూ.44.32 కోట్లు కేటాయించారు. ఈ నిధులను లోక్​పాల్  బిల్డింగ్  నిర్మాణాలకు ఖర్చు చేస్తారు. 2024–25 బడ్జెట్​లో లోక్​పాల్​కు రూ.67.65 కోట్లు కేటాయింగా.. ఈసారి కేటాయింపులు రూ.23.33 కోట్లు తగ్గాయి. 

ప్రధాన మంత్రి సహా రాజకీయ నాయకులందరిపైనా ఏమైనా అవినీతి ఆరోపణలు వస్తే, వాటిపై లోక్​పాల్  దర్యాప్తు జరుపుతుంది. కాగా.. సెంట్రల్  విజిలెన్స్  కమిషన్ (సీవీసీ)కు తాజా బడ్జెట్​లో రూ.52.07 కోట్లు కేటాయించారు. నిరుడు రూ.51.31 కోట్లు కేటాయించారు. ఈసారి రూ.76 వేలు పెంచారు.