మలక్ చించోలిలో తనిఖీల్లో రూ.5 లక్షలు సీజ్

సారంగాపూర్, వెలుగు: మండలంలోని మలక్ చించోలి ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. నిర్మల్ నుంచి మలక్ చించోలి వైపు వెళ్తున్న వాహనంలో  రూ.3.5 లక్షలు, స్వర్ణ వైపు నుంచి నిర్మల్ వెళ్తున్న వాహనంలో రూ.1.5 లక్షల నగదుకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చంద్రకాంత్ తెలిపారు. నగదును నిర్మల్ కలెక్టరేట్ గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు చెప్పారు.