
గజ్వేల్, వెలుగు: ఎలాంటి పేపర్స్ లేకుండా తీసుకెళ్తున్న రూ. 50 లక్షలను శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్పీఎస్పరిధిలోని అంబేద్కర్చౌరస్తాలో శుక్రవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ టైంలో రాయపోల్ గ్రామానికి చెందిన బచ్చు రత్నాకర్ కారులో రాగా పోలీసులు ఆపి తనిఖీ చేయడంతో రూ. 50 లక్షలు దొరికాయి. ఎలాంటి పేపర్స్ లేకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.