
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ మొత్తం నిధుల సేకరణ ఇప్పటివరకు రూ. 50వేల కోట్లకు చేరుకుంది. దేశంలో అతిపెద్ద లెండర్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల ప్రారంభంలో తన ఏడవ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ జారీ ద్వారా రూ.10వేల కోట్లను సమీకరించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 5వేల కోట్ల ఏటీ1 బాండ్‌లు, రూ. 15వేల కోట్ల టైర్ 2 బాండ్‌లు రూ. 30వేల కోట్ల లాంగ్ టర్మ్ బాండ్‌లను సంపాదించామని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులు మొదలైనవి వీటిలో ఇన్వెస్ట్చేశాయని ఎస్బీఐ తెలిపింది.