బేగంపేట మెట్రో స్టేషన్ సమీపంలోని మై హోమ్ టైకూన్ షాపింగ్ మాల్‌పై ఫైన్ పడింది. ఒక కస్టమర్ నుంచి అక్రమంగా పార్కింగ్ రుసుము రూ.10 వసూలు చేసినందుకు జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం ఆ షాపింగ్ మాల్ పై రూ.50వేల జరిమానా విధించింది. జీహెచ్ ఎంసీ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం.. జే సురానా అనే వ్యక్తి.. ట్విటర్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకున్నారు అధికారులు.
తెలంగాణ అపార్ట్‌మెంట్స్ యాక్ట్స్ అండ్ రూల్స్, 1987లోని 28, 24. జీవో168 ప్రకారం.. వినియోగదారుడు బిల్ చూపించినా కూడా పార్కింగ్ ఫీజును వసూలు చేయడం చట్టవిరుద్ధం. ఈ విషయం తెలిసినా మైహోమ్ టైకూన్ మాల్.. సురానా నుంచి పార్కింగ్ ఫీ వసూలు చేసింది. దాంతో సురానా ట్విట్టర్ ద్వారా.. జీహెచ్ ఎంసీకి కంప్లైంట్ ఇచ్చింది.