రైతులకు డబుల్ ధమాకా: వచ్చే సీజన్‎కు రూ.500 బోనస్ కంటిన్యూ: CM రేవంత్

హైదరాబాద్: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి డబుల్ ధమాకా ప్రకటించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్.. సన్నాలకు రూ.500 బోనస్ పైన కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత సీజన్‎లో సన్నాలు పండించిన రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని.. ఈ బోనస్ వచ్చే సీజన్‎కు కూడా కొనసాగిస్తామని రైతులకు శుభవార్త చెప్పారు. 

తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ లాంటి వంగడాలు వేస్తే పంట ఎక్కువ వస్తుందని నిపుణులు చెబుతున్నారని.. తెలంగాణ ప్రజలు కూడా ఈ రకం బియ్యమే ఎక్కువగా తింటున్నారని.. రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పంట వేయాలని సూచించారు. తెలంగాణలో పండిన బియ్యం.. రేషన్ షాపు‎లలో ఇవ్వలనుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలలో విద్యార్థులకు తెలంగాణలో పండిన బియ్యమే పెట్టాలని భావిస్తున్నామని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైతాంగం సన్నలు పండించాలని సూచిస్తున్నానని పేర్కొన్నారు.

ALSO READ | కేసీఆర్ రైతు బంధు ఎగ్గొడితే.. మేం వచ్చాక ఇచ్చాం: సీఎం రేవంత్

 కాగా, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సన్న వడ్లకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన మేరకు ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ రైతుల ఖతాల్లో జమ చేస్తోంది. ఈ క్రమంలోనే సన్నాలకు బోనస్‎ను వచ్చే సీజన్‎లో కూడా కంటిన్యూ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నిర్ణయంతో తెలంగాణ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.