బోధన్, వెలుగు: బోధన్‌లోని పాండు చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మహ్మద్షకీల్ ఆమేర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన చెరువులో చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా షకీల్ మాట్లాడుతూ పాండు చెరువు అభివృద్ధికి రూ.5.15 కోట్లు కేటాయించామని, పనులు కొనసాగుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని చెరువుల్లో 4.50 కోట్ల చేపపిల్లలు రూ.25 లక్షల రొయ్య పిల్లలు వదులుతున్నట్లు చెప్పారు.
మత్స్యకారుల కోసం రూ.5.68 కోట్లతో సబ్సిడీపై మోపెడ్ వాహనాలు అందించినట్లు తెలిపారు. చేపల మార్కెట్ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరయ్యాయన్నారు. బోధన్ఎమ్మెల్యేగా, మంత్రిగా 15 ఏండ్లు పదవిలో ఉన్న సుదర్శన్‌రెడ్డి ద్వారా నియోజకవర్గానికి ఒరిగిందేమి లేదన్నారు. అనంతరం రాకాసిపేట్‌లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బీఆర్ఎస్లీడర్లు రాంకిషన్రావ్, రవీంద్ర యాదవ్, ఎమ్మార్వో గంగాధర్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ హైమ్మద్ పాల్గొన్నారు.