అలంపూర్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా బుధవారం రూ.6,76,920 స్వాధీనం చేసుకొని గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు ఎస్పీ రితిరాజ్ తెలిపారు.
పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద ఐదుగురి నుంచి రూ.3,97,420, ఐజ మండలం వెంకటాపురం స్టేజీలో నిర్వహించిన తనిఖీల్లో ఒకరి నుంచి రూ.95 వేలు, మానవపాడు మండలంలో రూ.70 వేలు, నందిన్నె చెక్ పోస్ట్ దగ్గర రూ.1,14,500 సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.