RSA vs BAN: దక్షిణాఫ్రికా బ్యాటింగ్.. ఇరు జట్లలో కీలక మార్పులు

వన్డే ప్రపంచ కప్‌లో నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. ముంబై వాంఖడే వేదికగా మంగళవారం బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ  మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రొటీస్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బంగ్లా బ్యాటర్లు మొదట బౌలింగ్ చేయనుంది.

ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకూ నాలుగేసి మ్యాచ్‌లు ఆడగా దక్షిణాఫ్రికా మూడింటిలో, బంగ్లాదేశ్ ఒక దాంట్లో విజయం సాధించాయి. ఆటగాళ్ల పరంగా ప్రొటీస్ జట్టు బలంగానే కనిపిస్తున్నా.. పాకిస్తాన్‌పై ఆఫ్ఘన్ విజయం బంగ్లా ఆటగాళ్లలో కసి పెంచుతుందేమో చూడాలి.

తుది జట్లు

బంగ్లాదేశ్: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహ్మద్. 

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్),, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లిజార్డ్ విలియమ్స్.

ALSO READ :-Health Tip : చంటి పిల్లలకి గట్టి తిండి ఇలా పెట్టండి