దేశంలో స్వార్థం ఎక్కువై పోయింది: RSS చీఫ్ మోహన్ భగవత్

దేశంలో స్వార్థం ఎక్కువై పోయింది: RSS చీఫ్ మోహన్ భగవత్

దేశంలో స్వార్థం ఎక్కువైపోయిందని...ఇక ధర్మం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు RSS చీఫ్ మోహన్ భగవత్. ధర్మం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. వనవాసి, నగవాసి, గ్రామవాసి, ఎవరైనా భారతీయులేనన్నారు . లోక్ మంథన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇతిహాసం, సాంస్కృతి ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా భారత్ ఉందన్నారు కేంద్రమంత్రి గజేంద్ర శేఖావత్. సనాత ధర్మాన్ని కాపాడేందుకు లోక్ మంతన్ కార్యక్రమాలు మరిన్ని జరగాలన్నారు.  

హైదరాబాద్ శిల్పారామంలో లోక్ మంథన్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా RSS చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. సమావేశంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మూడ్రోజుల నుంచి జరుగుతున్న లోక మంథన్ కార్యక్రమంలో 12 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. దేశ సంస్కృతి ఉట్టిపడేలా జానపదాలు ప్రదర్శించారు కళాకారులు.