హిందువులపై దాడులు ఆపాలి: ఆర్ఎస్ఎస్

హిందువులపై దాడులు ఆపాలి: ఆర్ఎస్ఎస్

కోల్ కతా: బంగ్లాదేశ్​లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, అరెస్ట్ చేసిన హిందూ లీడర్లను వెంటనే రిలీజ్ చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కోరింది. భారత ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేయాలని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే విజ్ఞప్తి చేశారు.

బంగ్లాదేశ్​లో మైనార్టీల దాడులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టాలని కోరారు. ‘‘హిందూ మైనార్టీల ఇండ్లను లూటీ చేస్తూ, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుంటే.. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం చోద్యం చూస్తుండటం దారుణం” అని ఆయన అన్నారు.