మనుధర్మం రాజ్యాంగంగా ఉండాలని కోరుకునేది ఆరెస్సెసే: ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్

మనుధర్మం రాజ్యాంగంగా ఉండాలని కోరుకునేది ఆరెస్సెసే: ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్

హైదరాబాద్, వెలుగు: మనుధర్మం రాజ్యాంగంగా ఉండాలని కోరుకునేది ఆరెస్సెసే అని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ పని చేస్తున్నదని తెలిపారు. ఆదివారం గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేసుకునే అవకాశం డాక్టర్ బీఆర్. అంబేద్కర్ కల్పించారని చెప్పారు.

రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను అవమానించే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారని పేర్కొన్నారు. ప్రస్తుతం అమిత్ షా హోం మంత్రి అయ్యాడంటే.. అదీ రాజ్యాంగం వల్లనే అన్న విషయాన్ని గుర్తు చేశారు.