నిబంధనలు పాటించని 100 ప్రైవేట్ బస్సులపై కేసు..

హైదరాబాద్​: పండుగ పూట ప్రైవేట్ ట్రావెల్స్​ బస్సుల్లో ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. దిల్​సుఖ్​నగర్, ఎల్​బీ నగర్, హయత్​నగర్, పెద్ద అంబర్​పేట, కేపీహెచ్​బీ, లక్డీకాపూల్​తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి,100 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు ఆర్టీఏ విజిలెన్స్​ అండ్​ఎన్​ఫోర్స్​మెంట్ ​జేటీసీ చంద్రశేఖర్​గౌడ్​ తెలిపారు. 

ప్రైవేట్​ట్రావెల్స్​లో ​ప్రయాణికుల లగేజీ మాత్రమే అనుమతించాలని, కానీ కొందరు సరుకులను కూడా ట్రాన్స్​పోర్ట్ చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రూట్​పర్మిట్లు, ప్రయాణికులకు సౌకర్యాలు, బస్సుల్లో ఫస్ట్​ఎయిడ్​బాక్సులు, ఫైర్​సేఫ్టీ లేకపోయినా, ధరలు ఎక్కువ వసూలు చేసినా యాక్షన్​ తీసుకుంటామన్నారు. నాలుగైదు రోజులుగా చేస్తున్న తనిఖీల్లో సోమవారం నాటికి దాదాపు 480 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.