ఇవాళ్టి నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులపై ఫోకస్ చేశారు RTA అధికారులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ప్రతి స్కూల్ బస్సును చెక్ చేశారు. బస్సు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టి కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను తనిఖీలు చేశారు. రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, శేరిలింగంపల్లి తో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.
ఫస్ట్ ఎయిడ్ కిట్ లేని బస్సులకు, డ్రైవర్లు యూనిఫాం వేసుకోకపోవడంతో ఫైన్లు వేశారు. 30వాహనాలపై కేసు నమోదు చేశారు. కండిషన్లో లేని పలు బస్సులను సీజ్ చేశారు RTA అధికారులు.