![హైదరాబాద్లో ప్రైవేటు స్కూల్ వాహనాలపై ఆర్టీఏ దాడులు.. 10 వ్యాన్లు సీజ్](https://static.v6velugu.com/uploads/2025/02/rta-raids-on-private-school-vehicles-in-hyderabad-10-school-vans-seized_w0b8GqcFT5.jpg)
గురువారం (ఫిబ్రవరి6) పెద్ద అంబర్ పేట్ లో స్కూల్ విద్యార్థిని మృతితో ఆర్టీఏ అధికారులు స్పీడ్ పెంచారు. హైదరాబాద్ లో పలు చోట్ల స్కూల్ విద్యార్థులను తరలించే వాహనాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎల్బీనగర్ లోని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పై జరిపిన దాడులలో 10 ఓమ్నీ వ్యాన్ లను సీజ్ చేశారు అధికారులు.
నిబంధనలు పాటించకుండా స్కూల్ విద్యార్థులను తరలిస్తుండడంతో తనికీలు తనిఖీలు నిర్వహించారు. పొల్యూషన్ లేని, ఫిట్ నెస్ సరిగా లేని వాహనాలను సీజ్ చేశారు.
Also read :- హైదరాబాద్ మెట్రోకు 8 అవార్డులు
పెద్దఅంబర్ పేట్ లో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే విద్యార్థిని చనిపోయినందుకే ప్రస్తుతం దాడులు చేస్తున్నారని, మిగతా సమయంలో పట్టించుకోరని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగక ముందు వాహనాలను పట్టించుకోకుండా వదిలేసి.. ఏదైనా జరిగినప్పుడే ఆర్టీఏ అధికారులు హడావిడి చేస్తున్నారని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.