- ఈ ఆటోమేషన్ అప్లికేషన్‌తో ఆర్టీసీ సేవలు మరింత ఈజీ
- ముందుగా సికింద్రాబాద్ ఆర్టీఏ ఆఫీసులో అమలు
- ఆ తర్వాత సిటీలోని ఆఫీసులన్నింటిలో అందుబాటులోకి..
సికింద్రాబాద్, వెలుగు: డ్రైవింగ్‌లైసెన్సులు, వెహికల్స్రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరిగే పని తప్పనుంది. సింగిల్యాప్లో లైసెన్సుల రెన్యువల్, వెహికల్ట్రాన్స్ఫర్, రిజిస్ట్రేషన్లతోపాటు మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రవాణాశాఖ రెడీ అయింది. త్వరలో ‘వాహన్ సారథి’ పేరుతో మొబైల్అప్లికేషన్ను తీసుకురాబోతోంది. అక్టోబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ ఆర్టీఏ ఆఫీసులో అమలు చేసేందుకు ప్లాన్చేసింది. ప్రస్తుతం టీ-యాప్ ఫోలియో వంటి మొబైల్యాప్ ల ద్వారా వినియోగదారులు ప్రత్యక్ష సేవలు పొందేందుకు అవకాశం ఉంది. వచ్చే నెల నుంచి ‘వాహన్సారథి’ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్‌లో సక్సెస్అయితే సిటీలోని ఇతర ఆర్టీఏ ఆఫీసులు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.
ఇదో ఆటోమేషన్ అప్లికేషన్
వాహన్ సారథి అనేది ఆటోమేషన్ అప్లికేషన్. దేశ వ్యాప్తంగా రవాణా సేవలను ఏకీకృతం చేసేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకురాగా, 2002లో మొదటిసారి పలు రాష్ట్రాలు అమలు చేశాయి. వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో 2006లో జాతీయ ఈ–-గవర్నెన్స్ప్రోగ్రాం కింద రోడ్డు రవాణా మిషన్ మోడ్ప్రాజెక్టులో వాహన్సారథి భాగమైంది. ప్రస్తుతం దేశంలోని రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని11వేల ఆర్టీఓలలో అందుబాటులో ఉంది.
‘సారథి’లో లైసెన్సుల సేవలు
వాహన్సారథి యాప్‌లో ప్రధానంగా రెండు ఆప్షన్స్ఉంటాయి. ఇందులోని ‘సారథి’లో పాత డ్రైవింగ్ లైసెన్సులు రెన్యువల్, అడ్రస్మార్పు వంటి సేవలు పొందవచ్చు. ఉద్యోగ, వ్యాపార అవసరాల రీత్యా ఒక జిల్లా మరో జిల్లాకు లేదా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినపుడు డ్రైవింగ్ లైసెన్సులు ట్రాన్స్ఫర్పెట్టుకోవాలంటే సంబంధిత ఆర్టీఏ అధికారి నుంచి నోఅబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న అప్లికేషన్ద్వారా ఆన్లైన్లోనే ప్రాసెస్అంతా చేసుకోవచ్చు. లైసెన్స్హోల్డర్వివరాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎక్కడ నుంచి ఎక్కడికైనా లైసెన్సులను మార్చుకోవచ్చు. ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండానే పని అయిపోతుంది. సంబంధిత డాక్యుమెంట్లు అప్ లోడ్‌చేసి, నిర్ణీత ఫీజు చెల్లిస్తే వెంటనే ఆర్టీఏ ఆఫీసర్ ఆన్లైన్లోనే ఓకే చేస్తారు. వెంటనే లైసెన్స్ట్రాన్స్ఫర్జరిగి కొత్త అడ్రస్‌తో డిజిటల్ కార్డు జారీ అవుతుంది.
‘వాహన్’లో వెహికల్స్ కు సంబంధించి..
ఇప్పటికే వాహన్సారథిని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో రిజిస్టర్‌అయిన అన్ని వాహనాల వివరాలు ‘వాహన్’లో అందుబాటులో ఉంటాయి. త్వరలో మన డేటా కూడా నమోదు కానుంది. దీని ద్వారా వెహికల్కొన్న వెంటనే షో రూమ్ లో పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సదుపాయం లభించనుంది. ప్రస్తుతం ఆటో మొబైల్ డీలర్లు టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తున్నారు. నెలరోజుల తర్వాత ఆర్టీఏ ఆఫీసర్లు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు(ఆర్సీ) జారీ చేస్తున్నారు. మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనాన్ని బదిలీ చేసేందుకు ప్రస్తుతం ఎన్ఓసీలు సమర్పించాల్సి ఉంది. ఇక నుంచి వాహనాలను బదిలీ చేసేందుకు ఎన్ఓసీలు అవసరం ఉండదు. సదరు వాహన వివరాలను ‘వాహన్’లో ఎంట్రీ చేస్తే వెంటనే బదిలీ చేస్తారు. ప్రమాద బీమా సదుపాయం కూడా తేలికగా లభిస్తుంది.
ఆన్ లైన్లోనే డ్రైవింగ్ టెస్టులు
ప్రస్తుతం ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్ లైసెన్సులు పరీక్షలు జరుగుతున్నాయి. వాహన్సారథి అప్లికేషన్అమలులోకి వస్తే ఈ టెస్టును ఆన్ లైన్లో రాయొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారు వివరాలు నమోదు చేసి, నిర్ణీత ఫీజు చెల్లించి ఎక్కడి నుంచైనా ఆన్ లైన్ టెస్ట్రాయొచ్చు. కర్ణాటకలో ఈ ప్రాసెస్ విజయవంతంగా అమలవుతోంది. ఇలా లెర్నింగ్ లైసెన్సు పొందినవారు ఆరు నెలల్లోపు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్ట్ ట్రాకులలో అధికారులు నిర్వహించే ప్రత్యక్ష పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఆర్టీఏ సేవలు మరింత ఈజీ
వాహన్సారథితో ఆర్టీఏ సేవలు మరింత ఈజీ కానున్నాయి. ఇందులో వాహనాల రిజిస్ట్రేషన్, పర్మిట్, టాక్సేషన్, ఫిట్నెస్, మోటాట్డ్రైవింగ్ స్కూల్స్, లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్, ఇతర అనేక సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల డిజిటల్రూపంలో అందుబాటులోకి వస్తాయి. త్వరలో సికింద్రాబాద్ఆర్టీఏ ఆఫీసులో సిబ్బందికి వాహన్సారథిపై శిక్షణ ఉంటుంది. అమలులోకి రాగానే వెహికల్స్, లైసెన్స్హోల్డర్ల డీటెయిల్స్అందులో నమోదవుతాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్సెంటర్ ద్వారా వివరాలన్నింటిని నమోదు చేయనున్నాం. ఎంవీ స్వామి, ఆర్టీఓ, సికింద్రాబాద్