- సిటీ ఎంట్రీ, ఓఆర్ఆర్సమీపంలో ముమ్మర తనిఖీలు
ఎల్బీనగర్/గండిపేట, వెలుగు: సంక్రాంతి పండుగ ముసుగులో ఫిటెనెస్లేకుండా నడిపిస్తున్న ప్రైవేట్ట్రావెల్స్బస్సులపై ఆర్టీఏ అధికారులు ఫోకస్ పెట్టారు. శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వేర్వేరు చోట్ల 48 ప్రైవేట్ట్రావెల్స్బస్సులపై కేసులు నమోదు చేశారు. 13 బస్సులను సీజ్చేశారు.
సిటీ నుంచి విజయవాడ, ఏపీలోని ఇతర ప్రాంతాలకు వెళ్తున్న బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నాగోలు ఇన్చార్జ్ ఆర్టీఓ అమరనాథ్ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున ఎల్బీనగర్ చింతలకుంటలో బస్సులను తనిఖీ చేశారు. 21 బస్సులపై కేసు నమోదు చేసి ఒక బస్సును సీజ్ చేశారు.
పెద్దఅంబర్ పేట సమీపంలోని ఓఆర్ఆర్వద్ద తనిఖీలు నిర్వహించి 11 బస్సుల ను సీజ్ చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణాశాఖ కమిషనర్ సురేందర్ మోహన్ ఆదేశాలతో తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఆర్టీఓ ఆఫీసర్అమరనాథ్తెలిపారు. అలాగే ఆరాంఘర్– బెంగళూరు హైవేపై నిర్వహించిన తనిఖీల్లో 16 ప్రైవేట్ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ డిప్యూటీ కమిషనర్ సదానంద తెలిపారు. ఒక బస్సును సీజ్చేశామన్నారు.