బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి ప్రత్యేక బస్సులు

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి ప్రత్యేక బస్సులు

హైదరాబాద్, వెలుగు: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలకు గ్రేటర్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 8న ఎదుర్కోలు, 9న కల్యాణం, 10న రథోత్సవం జరగనుండగా, ఆ మూడు రోజులు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ హైదరాబాద్​ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సిటీ నలుమూలల నుంచి ఎస్ఆర్ నగర్ బస్టాప్​వరకు నడుస్తాయని వెల్లడించారు.

సికింద్రాబాద్​రైల్వే స్టేషన్​నుంచి 6, జూబ్లీబస్​స్టేషన్​ నుంచి 6, ఎంజీబీఎస్​ నుంచి 4, సీబీఎస్ నుంచి 6, లింగంపల్లి నుంచి 6, ఈసీఐఎల్​క్రాస్​రోడ్స్​నుంచి 4, మెహిదీపట్నం నుంచి 4, కాచిగూడ రైల్వే స్టేషన్​నుంచి 5, హయత్​నగర్ నుంచి 2, దిల్​సుక్​నగర్​ నుంచి 5, చార్మినార్​ నుంచి 4, చాంద్రాయణగుట్ట నుంచి 4, ఉప్పల్​ నుంచి 4, మియాపూర్​ క్రాస్​రోడ్స్​నుంచి 4, రామ్​నగర్​ నుంచి 4, మల్కాజిగిరి నుంచి 3 బస్సులు నడుపుతున్నట్లు స్పష్టం చేశారు. వివరాలకు కూకట్​పల్లి వైపు నుంచి వచ్చేవారు 99592 26148, 99592 26151 నంబర్లలో, సికింద్రాబాద్​వైపు నుంచి వచ్చేవారు 99592 26147లో సంప్రదించాలని సూచించారు.

ఎల్లమ్మకు పట్టు వస్త్రాలు

బల్కంపేట ఎల్లమ్మ తల్లికి పద్మశాలి సంఘం సభ్యులు శనివారం పోచంపల్లి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ఆవరణలో మగ్గంపై నేసిన వస్త్రాలను పద్మశాలి సంఘం సభ్యులు, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ఆలయ ఈఓ, చైర్మన్​కు అందజేశారు.