శ్రీరామ నవమి పోస్టర్​ అవిష్కరణ

శ్రీరామ నవమి పోస్టర్​ అవిష్కరణ

బోధన్, వెలుగు :  బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో రాములోరి తలంబ్రాలు, స్టిక్కర్ల కరపత్రాలను డిపో మేనేజర్ విశ్వనాథ్ అవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్​ విశ్వనాథ్ మాట్లాడుతూ ఏప్రిల్​ 7న శ్రీరామనవమి పురస్కరించుకొని భద్రాచలం రాములోరి తలంబ్రాలు   కార్గో ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

  కేవలం రూ.151కే ఇంటి దగ్గరనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల కార్గో ఇన్​చార్జి పాల్, కార్గో లాజిస్టిక్​ ఇన్​చార్జి డీఎంఈ వీకే.కిషోర్, ఉద్యోగులు పాల్గొన్నారు.