
మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద రెండు ద్విచక్ర వాహనాలను మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.